prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 4:28 am Digital Edition : RAJASHEKARREDDY

నీట్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి – బిఆర్ఎస్ యువజన నాయకులు కొరివి తిరుపతి

 

బెజ్జంకి,మే 18(ప్రజావాణి)

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట్ గ్రామానీకి చెందిన బిఆర్ఎస్ యువజన నాయకులు కొరివి తిరుపతి ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందన్నారు.2024లో జరిగిన లీకేజీ ఘటన నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు.
నీట్ నిర్వహణ సంస్థ అయిన ఎన్టీఏను తక్షణమే రద్దు చేసి, లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.