prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 6:49 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాజ్యమేలుతున్న దళారులు

నందిగామ,(మే 21,ప్రజావాణి) ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు.ఎన్టీఆర్ జిల్లా నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రస్తుతం అక్రమాలకు అడ్డాగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు.ఎన్టీఆర్ జిల్లా నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రస్తుతం అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక్కడ అధికారుల అండదండలతో దళారుల వ్యవస్థ వేళ్లూనుకు పోయిందని,సామాన్య ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేలల్లో వసూళ్లు.ముఖ్యంగా వివాహ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే అమాయక ప్రజలే లక్ష్యంగా ఈ దళారీ వ్యవస్థ నడుస్తోంది.పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం వచ్చే వారి వద్ద నుండి బయట వ్యక్తులు రూ.4 వేల నుండి రూ.10 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజు కంటే ఐదారు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు.కార్యాలయం బయటే తిష్టవేసే కొందరు వ్యక్తులు, అధికారులతో తమకున్న పరిచయాలను ఆసరాగా చేసుకుని ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.ఏసీబీ దాడులు జరిగినా.మారని తీరు గతంలో ఇబ్రహీంపట్నం కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.ఆ సమయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు, అప్పటి సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకుని బదిలీ కూడా చేశారు.కార్యాలయంలో జరుగుతున్న ఈ వ్యవహారాలపై వివరణ కోరేందుకు ఒక రిపోర్టర్ నందిగామ సబ్ రిజిస్ట్రార్కు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం.ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కింది స్థాయి సిబ్బంది,దళారులు ఇలా రెచ్చిపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ జరిపి,దళారీ వ్యవస్థను అరికట్టాలని, అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.వేటు వేస్తున్నా.ఆగని తీరు.రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఇటీవల ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించిన సబ్‌రిజిస్ట్రార్లు కార్యాలయాల్లో లంచాలు తీసుకోవడం మాత్రం ఆగడంలేదు. చేతులు తడపనిదే పనులు జరగని పరిస్థితి నెలకొన్నది.రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కనుసన్నుల్లోనే రిజిస్ట్రార్లు.నందిగామ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు,డాక్యు మెంట్‌ రైటర్ల కనుసన్నుల్లో నడుస్తున్నాయి. వీరు ప్రతి ఫైల్‌కు ఇంత మొత్తామని ఫిక్స్‌ చేసి మరీ వసూలు చేసి అధికారులకు ఇస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరో పణలున్నాయి.సామాన్యులు కార్యాలయాలకెళ్తే పలు కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారని అదే డాక్యుమెంట్‌ రైటర్లు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ద్వారా వెళ్తే పనులు త్వరగా జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.