Writing
జూన్ 25 నుంచి తెలంగాణలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం
ఓటర్ల జాబితాపై గ్రామ స్థాయిలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ BLAలకు పిలుపునిచ్చిన కొందుర్గు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి.
ఈ రోజు కొందుర్గు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో మండల తహసీల్దార్ అజం అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన SIR అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ… ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా చూడటానికే SIR కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అనర్హుల పేర్లు ఉండకూడదని అన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ BLAలు చురుకుగా పనిచేసి ఓటర్లను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరారు.
ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2002లో SIR సర్వే నిర్వహించగా, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి ఈ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అధికారులు 2002 నాటి మరియు తాజా ఓటర్ల జాబితాలను BLOలకు అందజేశారని చెప్పారు.
సర్వేలో పాల్గొనలేకపోయినా, జులై 31న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు జరిగే అభ్యంతరాలు, ఫిర్యాదుల కాలంలో ఫారం-6 ద్వారా పేరును నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. కొత్త ఓటర్లు కూడా ఇదే ఫారాన్ని ఉపయోగించాలని సూచించారు.