prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 6:55 pm Digital Edition : GIRIBABU KONDHURG

చాకలి అంజయ్య మృతి బాధాకరం షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కొందుర్గ్ మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ సంతాపం

చాకలి అంజయ్య మృతి బాధాకరం

షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కొందుర్గ్ మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ సంతాపం

కొందుర్గ్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు చాకలి అంజయ్య గారు అనారోగ్య సమస్యలతో ఈరోజు ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర బాధాకరమని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు పేర్కొన్నారు.

ఈ విషయం తెలుసుకున్న అనంతరం అంజయ్య యాదవ్ గారు ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి చాకలి అంజయ్య గారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాకలి అంజయ్య గారు గ్రామ ప్రజలతో ఎంతో ఆత్మీయంగా మెలుగుతూ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని గుర్తుచేశారు. వారి మృతి గ్రామానికి తీరని లోటని అన్నారు.

వారి వెంట కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ గారు, మంగలి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.