ఘనంగా ఘట్కేసర్‌లో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

ఘట్కేసర్, మే 28 : మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన ఎన్ టి రామరావు 103వ జయంతిని ఘట్కేసర్‌లో ఘనంగా నిర్వహించారు. మేడ్చల్–మల్కాజ్గిరి పార్లమెంట్ అడక్ కమిటీ మెంబర్ వేముల సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మజ్జిగ...