ఘట్‌కేసర్‌లో ప్రజాపాలన–ప్రగతి కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష
ఘాట్ కేసర్ మే 19: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా పౌరులకు మెరుగైన సేవలు అందించే దిశగా పరిష్కరించాల్సిన వివిధ పారిశుధ్య సమస్యలపై సంబంధిత సెక్షన్ అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘట్‌కేసర్ వార్డ్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో కొనసాగుతున్న జనగణన (సెన్సస్ ఎనిమరేషన్) ప్రక్రియను పరిశీలించి,...