prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 7:43 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గ్రామీణ పేదల బతుకులు మార్చిన ఎంజీఎన్ఆర్జీని పునర్దించాలి.పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని

నందిగామ (మే21ప్రజావాణి) పల్లగిరి,రాఘవాపురం, గ్రామంలో పని ప్రదేశాల్లో పర్యటించడం జరిగింది.వ్వవసాయం కార్మికం సంఘం నందిగామ ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సయ్యద్ ఖాసిం,కె గోపాల్.మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిప్ భారత్ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ( విబి-రాంబి) తో గ్రామీణ ప్రాంతాల్లో నీరుద్యోగం మరింతగా పెరిగిపోతుంది ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పుడున్న మరొకరు ఉపాధికి కూడా ఇది ఉరితాళ్ళు బిగిస్తుంది. మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి, గ్రామీణ కార్మికులను కార్పొరేట్ శక్తులకు చౌక శ్రమగా మార్చడానికి పద్ధతి ప్రకారం దీన్ని బలహీనపరుస్తుంది, వి బి జి రాంజీ అనేది పని హక్కులను కాలరాసే ఒక ప్రమాదకరమైన విధానం. ఇది ఉపాధి కల్పించే చట్టం కాదు నిరుద్యోగం ఆకలి చావులు వలసలు మరణాలకు గ్యారెంటీ ఇచ్చే విధానం.పేరుకి 125 రోజుల పని దినాలు కల్పిస్తున్నాం అన్న 60 రోజులు వ్యవసాయ సీజన్లో నిషేధించారు. దీనివలన పని దినాలు తగ్గుతుంది పాత చట్టంలో 90% నిధులు కేంద్రం వాటా మందులు చేసేది. కొత్త చట్టం ప్రకారం 60 శాతం నిధులు కేంద్ర రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలని కొత్త చట్టం చెబుతుంది. దీనివల్ల సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వేతనాల వల్ల తీవ్ర ఉపాధి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజుకు రెండుసార్లు డిజిటల్ హాజరు పని ప్రదేశాల్లో కార్మికుల ఫోటోలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని నిర్బంధ విధానాలను తీవ్రంగా ఖండించాలి. కార్మిక వర్గం సమిష్టిగా ఈ దాడులను తిప్పి కొట్టాలి దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేసే విధానాలను ప్రజలు సహించరు ఉపాధి హామీ రక్షణకు పని ప్రదేశాలు నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు 300/- రూపాయలు ఇవ్వటానికి 100 కారణాలు పెట్టి ఉపాధి నుండి మనల్ని దూరం చేయడానికి మోడీ,బాబు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నాయి కాబట్టి పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలి.ఫేస్ యాప్ రెండు పూటల పనినీ రద్దు చేయాలి.పెండింగ్ వేతనాలు ప్లే సిప్స్ పనిముట్ల ప్రమాదంలో చనిపోతే 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని. కార్మికులకు పనిముట్లు ఇవ్వాలని మంచినీళ్లు టెంటు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కూలీలు ప్రతిప్,అప్పారావు,రామారావు, అనిల్,కోటేశ్వరమ్మ, లక్ష్మి,పోల్గోన్నారు.