prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 1:53 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్, బైక్ రేసింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన జిల్లా పోలీసులు

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) మహిళల రక్షణ మరియు భద్రత పట్ల జిల్లా పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.ప్రజల భద్రత,ముఖ్యంగా మహిళలు మరియు ఆడపిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు(07.052026) ఈవ్ టీజింగ్‌,బైక్ రేసింగ్‌,రాష్ డ్రైవింగ్‌ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఆకతాయిల చర్యలకు అడ్డుకట్ట చట్టవిరుద్ధ చర్యలపై కఠిన నిఘా ఈ ప్రత్యేక డ్రైవ్‌లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించినారు,బైక్ రేసింగ్ మరియు రాష్ డ్రైవింగ్ చేస్తున్న,గుర్తించి,వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.భవిష్యత్తులో ఇటువంటి చర్యలు కొనసాగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఈ డ్రైవ్‌లో డీఎస్పీ స్థాయి నుండి హోంగార్డు స్థాయి వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి స్కూళ్లు,కాలేజీలు,ప్రధాన రహదారులు,షాపింగ్ మాల్స్‌,మార్కెట్లు,సినిమా థియేటర్లు,బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు,అపార్ట్‌మెంట్లు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.మహిళలు,ఆడపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించడం అనుచిత వ్యాఖ్యలు చేయడం,వెంబడించడం, సోషల్ మీడియా ద్వారా వేధించడం,గోప్యతకు భంగం కలిగించడం వంటి ఈవ్ టీజింగ్ చర్యలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.కొంతమంది ఆకతాయిలను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరికలు జారీ చేశారు.ఈవ్ టీజింగ్ అనేది చిన్న తప్పు కాదని,అది మహిళల గౌరవం,భద్రత,స్వేచ్ఛకు భంగం కలిగించే నేరమని పోలీసులు స్పష్టం చేశారు.మహిళలను వేధించడం,అసభ్య ప్రవర్తన చేయడం,సోషల్ మీడియా ద్వారా అసభ్య సందేశాలు పంపడం వంటి చర్యలు చట్టరీత్యా శిక్షార్హమైన నేరాలని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత,ఐటి చట్టం మరియు మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.బైక్ రేసింగ్‌,స్నేక్ డ్రైవింగ్‌పై ఉక్కుపాదం:అదే విధంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాధ్యతారాహిత్యంగా పెద్ద శబ్దాలు చేస్తూ వాహనాలు నడపడం,బైక్ రేసింగ్‌,స్నేక్ డ్రైవింగ్‌ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. అవసరమైన చోట్ల చట్టపరమైన చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,ఏ రూపంలోనైనా ఈవ్ టీజింగ్‌, బైక్ రేసింగ్‌,రాష్ డ్రైవింగ్ వంటి చట్టవిరుద్ధ చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.బైక్ రేసింగ్‌కు పాల్పడే వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు మోటార్ వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.మహిళలు,ఆడపిల్లల భద్రత పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత అని పేర్కొంటూ,ప్రజలు ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు.యువత చట్టాన్ని గౌరవించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని,ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని,ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని జిల్లా ఎస్పీ  తెలిపారు.