గంజాయి నిర్ములనకు ప్రత్యేక కిట్లతో నిఘా. డీఎస్పీ చెంచుబాబు

సూళ్లూరుపేట (మే21 ప్రజావాణి) తిరుపతి జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా, అమ్మకాలు మరియు వాడుకను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు.సూళ్ళూరుపేట సర్కిల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడుతూ,,,గతంలో గంజాయికి అలవాటు పడిన పాత కన్జ్యూమర్స్, అనుమానితులను గుర్తించి,వారికి తక్షణమే పరీక్షలు చేయడం కోసం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక కిట్లను అందుబాటులోకి తెచ్చారని డీఎస్పీ పేర్కొన్నారు.ఈ కిట్లలో...