కార్మికుల కోసం నిరంతరం కృషి చేసే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ

ఎర్రజెండాను కాపాడుకుందాం సీపీఎం పిలుపు సీపీఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ బెజ్జంకి, మే 1 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, 1886లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద కార్మికులు ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనాల కోసం చేపట్టిన పోరాటాన్ని గుర్తుచేశారు. ఆ పోరాటంలో అమరులైన కార్మికుల త్యాగాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా...