ఎర్రజెండాను కాపాడుకుందాం సీపీఎం పిలుపు
సీపీఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్
బెజ్జంకి, మే 1 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, 1886లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద కార్మికులు ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనాల కోసం చేపట్టిన పోరాటాన్ని గుర్తుచేశారు. ఆ పోరాటంలో అమరులైన కార్మికుల త్యాగాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు హక్కులుసాధ్యమయ్యాయని పేర్కొన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో సీపీఎం పార్టీ పాత్రను ప్రస్తావిస్తూ, నైజాం పాలనలో దొరల అణచివేతకు వ్యతిరేకంగా ఎర్రజెండా పోరాటం చేసి, వెట్టిచాకిరి నిర్మూలనతో పాటు పేదలకు లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసిన చరిత్రను వివరించారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండాను కాపాడుకోవడం కార్మికులు, పేదల బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సంఘ ఎల్లయ్య, బొమ్మిడి సాయి కృష్ణ, బోనగిరి లింగం, సర్పంచ్ బొల్లం పెద్దన్న, మాజీ ఎంపీటీసీలు లింగాల లక్ష్మణ్, గుబిరే మల్లేశం, దుంబాల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.