ఏపీఐఐసీ భూసేకరణలో భాగంగా*ఎకరాకు రూ.28 లక్షల నష్టపరిహారం అందిస్తాం*రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుంది,జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి జిల్లా (మే21ప్రజావాణి) సత్యవేడు మండలంలోని ఇరుగుళం, కొల్లడం,పెద్ద ఈటీపాకం గ్రామాలలో ఏపీఐఐసీ పరిశ్రమల అభివృద్ధి కోసం జరుగుతున్న భూసేకరణలో భాగంగా పలు గ్రామాల రైతులతో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు,సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్రరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రైతులతో భూసేకరణ,నష్టపరిహారం, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యవేడు మండలంలోని ఇరుగుళం,కొల్లడం...