ఇంటింటి జనగణన ప్రక్రియను పరిశీలించిన సెన్సస్ జాయింట్ డైరెక్టర్ &ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జి. ప్రసన్న కుమార్
మంగళగిరి మే 19 ప్రజావాణి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జనగణన–2027 ప్రక్రియను సెన్సస్ జాయింట్ డైరెక్టర్ శ్రీ జి. ప్రసన్న కుమార్ మరియు నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్. అలీమ్ బాషా సంయుక్తంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని హాస్పిటల్ రోడ్డు వద్ద గృహాలను సందర్శించి,జనగణన సిబ్బంది నిర్వహిస్తున్న వివరాల సేకరణ విధానాన్ని పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు,నివాస పరిస్థితులు,తెలుసుకున్నారు. సెన్సస్ ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా ఖచ్చితత్వంతో సమాచారాన్ని నమోదు చేయాలని అధికారులకు సూచించారు....