prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 1:54 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఇంటింటి జనగణన ప్రక్రియను పరిశీలించిన సెన్సస్ జాయింట్ డైరెక్టర్ &ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జి. ప్రసన్న కుమార్

మంగళగిరి మే 19 ప్రజావాణి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జనగణన–2027  ప్రక్రియను సెన్సస్ జాయింట్ డైరెక్టర్ శ్రీ జి. ప్రసన్న కుమార్ మరియు నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్. అలీమ్ బాషా సంయుక్తంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని హాస్పిటల్ రోడ్డు వద్ద గృహాలను సందర్శించి,జనగణన సిబ్బంది నిర్వహిస్తున్న వివరాల సేకరణ విధానాన్ని పరిశీలించారు.
ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు,నివాస పరిస్థితులు,తెలుసుకున్నారు. సెన్సస్ ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా ఖచ్చితత్వంతో సమాచారాన్ని నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయడంతో పాటు,ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అయన తెలిపారు.ఈ సందర్భంగా సూపర్వైజర్లు మరియు ఎన్యూమరేటర్లకు పలు సూచనలు చేశారు.ప్రతి ఇంటిని తప్పకుండా సందర్శించి, ఎవరూ మిగిలిపోకుండా జనగణన నిర్వహించాలని సూచించారు అలాగే ప్రతి ఇంటిలో జనగణన ప్రక్రియ పూర్తయిన అనంతరం సంబంధిత గృహ గోడపై నిర్దేశిత గుర్తులు  మరియు వివరాలు తప్పనిసరిగా రాయాలని ఎన్యూమరేటర్లకు ఆదేశించారు.మరి ముఖ్యంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న ప్రజలు సెన్సస్ సిబ్బంది కి సెల్ఫ్ ఎన్యుమరేషన్ తప్పని సరిగా ID తెలిపి సహకరించాలని తెలిపారు .ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ అలీమ్ బాషా మాట్లాడుతూ,జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది వంటిదని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు,మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం,ఉపాధి తదితర రంగాల్లో సరైన ప్రణాళికలు రూపొందించేందుకు జనగణన గణాంకాలు కీలకమని తెలిపారు.మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలు జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కమిషనర్ కోరారు.ఇంటింటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు సరైన మరియు పూర్తి సమాచారం అందించి,జనగణన విజయవంతానికి ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సెన్సస్ సిబ్బందిని సహకరించి, ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.అదే విధంగా జనాభా గణనకు సంబంధించిన సందేహాల నివృత్తి ,సమాచారం లేదా వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1855 కు కాల్ చేయుట ద్వారా తగు సమాచారం పొందవచని అయన తెలిపారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ కమీషనర్ శకుంతల,డిప్యూటీ కమీషనర్ శ్రీకాంత్ ,సెన్సస్ ఆఫీసర్ జగన్నాధ్ పూరి, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.