అభాగ్యుల అంతిమయాత్రలో పాల్గొంటే నిజమైన ఆధ్యాత్మిక తత్వం బోధపడుతుంది – వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణా రెడ్డి
వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02) పోరుమామిళ్ళ జననం సాధారణంగా ఉన్నా,మరణం మాత్రం పదిమంది కన్నీళ్లు పెట్టుకునేలా ఉండాలి అంటాడు ఒక కవి.పుట్టడానికి ముందు అమ్మ గర్భంలో తొమ్మిది నెలల ప్రయాణం రాజుకైనా,సేవకుడికైనా ఒకేలా ఉంటుంది.కానీ,మరణించాక స్వగృహం నుంచి స్మశానం వరకు సాగే అంతిమయాత్ర మాత్రం ఒక్కొక్కరికి ఒక్కోలా సాగుతుంది.ఈ యాత్రను బట్టి ఆ వ్యక్తి జీవించిన తీరు చెప్పవచ్చు.కొందరు మరణిస్తే భూమికి భారం తగ్గిందంటారు,త్వరగా స్మశానంలో పడేస్తే బాగుంటుందని భావిస్తారు.కొందరు మరణిస్తే ఆత్మీయుల కన్నీటితో పుడమి తడుస్తుంది.స్మశానం కూడా మౌనంగా,గంభీరంగా రోదిస్తుంది.కొందరి...