అడవిలో తవ్వుతుండగా బయటపడ్డ లంకెబిందెలు…

మార్కాపురం జిల్లా (మే21 ప్రజావాణి) గిద్దలూరు టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు,ట్రైబల్ వాచర్ల సహాయంతో తవ్వకాలు జరిపి లంకెబిందెలను వెలికితీశారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల్లో లంకెబిందెలు బయటపడ్డాయన్న సమాచారం కలకలం రేపుతోంది. ఓ గుప్తనిధుల ముఠా ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు గుప్త నిధులను తవ్వి అందులో లభించిన లంకెబిందెల్లోని సొమ్ము స్వాహా చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది....