అక్రమ వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి<br>

*అక్రమ వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి** *మన ప్రజావాణి*, *మందమర్రి రూరల్*:- మే 27మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయితీ లేమూరు శివారులో గల అక్రమ వెంచర్ల పై సమగ్ర విచారణ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బచ్చలి ప్రవీణ్ కుమార్ బుధవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని లేమూరు శివారులో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కొంతమంది వ్యక్తులు అక్రమ వెంచర్ల పేరుతో వ్యవసాయ భూములను ప్లాటింగ్ చేసి, విక్రయాలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతులు, సంబంధిత శాఖల లేఅవుట్...