అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఘట్‌కేసర్‌లో 141వ మే డే వేడుకలు
ఘట్‌కేసర్, మే 1 (ప్రజావాణి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్‌కేసర్ మండలంలో 141వ మే డే వేడుకలను వివిధ కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కార్మికులు, హెచ్పిసిఎల్ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఆస్పత్రి ఔట్సోర్సింగ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు భారీగా పాల్గొన్నారు. ఘట్‌కేసర్ టౌన్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిహెచ్ఎంసి ఘట్‌కేసర్ సర్కిల్ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరణ కార్యక్రమం...