లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తాం.అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీపీఎం కడప

కడపజిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్14)దేశంలో బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టే విధానాలకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం విస్తృతంగా ప్రజానీకాన్ని కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ కడప నగర కార్యదర్శి రామమోహన్ పిలుపునిచ్చారు.మంగళవారం నాడు కడప నగరంలోని మృత్యుంజయకుంటలో ఉన్న సిపిఎం పార్టీ ఆఫీసులో పార్టీ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ కుల అస్తిత్వం ఉన్నంతకాలం కుల నిర్మూలన సాధ్యం కాదని డాక్టర్ బి.ఆర్...