రేకొండలో అంబేద్కర్ జయంతి జోష్ – యువత భారీ ర్యాలీతో ఘన నివాళి.

మన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి: “బోధించు, సమీకరించు, పోరాడు” అంటూ జనప్రభంజనాన్ని జాగృతం చేసిన సామాజిక అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం రోజున రేకొండ గ్రామంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం (AIAYS) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని అంబేద్కర్ సామూహిక భవనం నుండి యువకులు నీలి జెండాలతో, గ్రామపంచాయతీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల...