నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం — మాజీ ఆర్మీ జవాన్ అన్వర్
ఘట్‌కేసర్, ఏప్రిల్ 27 (ప్రజావాణి): నిజాయితీ, బాధ్యతాయుత ప్రవర్తనతో ఒక మాజీ ఆర్మీ జవాన్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఘట్‌కేసర్‌కు చెందిన మహమ్మద్ అన్వర్, విధుల్లో ఉన్న సమయంలో ట్రైన్‌లో దొరికిన విలువైన వస్తువులను యజమానికి తిరిగి అందజేసి ప్రశంసలు పొందాడు. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో సికింద్రాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తున్న రైలులో ఒక బ్యాగ్ అన్వర్‌కు దొరికింది. ఆ బ్యాగ్‌లో సుమారు మూడు తులాల బంగారం తో పాటు మరికొన్ని విలువైన వస్తువులు ఉన్నట్లు తెలిసింది. తన నిజాయితీని...