నారపల్లి యమనంపేటలో తెలంగాణ అమరవీరుల జ్ఞాపకతో చలివేంద్రం ప్రారంభం… మీసాల రాజేష్ వల్ల ప్రజలకు చల్లని మంచి నీటి సేవలు
ఘట్కేసర్, ఏప్రిల్ 16 (ప్రజావాణి): ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో యమనంపేట్, నారపల్లి ప్రాంతంలో అమరవీరుల స్మారకార్థం చలివేంద్రం ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని మీసాల రాజేష్ పోచారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, అంబేద్కర్ యువజన సంఘం, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీసాల రాజేష్ పోచారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రయాణికులు, కార్మికులు మరియు సాధారణ ప్రజలు దాహార్తి నుంచి...