prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 5:47 am Digital Edition : RAJASHEKARREDDY

గూడెం-బేగంపేట రహదారి ప్రయాణం నరకమే.. రోడ్డు మరమ్మత్తు చేయాలని రోడ్డుపై బైటాయింపు

 

బెజ్జంకి, ఏప్రిల్ 28(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం–బేగంపేట గ్రామాలను కలుపుతున్న రహదారి ప్రయాణం నరకంగా మారింది.గుంతలతో నిండిపోయిన ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.వర్షాల కారణంగా రహదారి మరింత దెబ్బతిని,వాహనదారులు,పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు.గ్రామస్తులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,రాష్ట్ర రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ తక్షణమే స్పందించి రహదారి మరమ్మత్తు చెపట్టాలని గ్రామస్థులు, వాహన దారులు కోరుతున్నారు .స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యను పట్టించుకోకపోతే తీవ్ర నిరసనలు చేపడతామని గ్రామస్థులు తెలిపారు.బేగంపేట మాజీ సర్పంచ్ పోతిరెడ్డి వెంకట్రెడ్డి, గూడెం మాజీ సర్పంచ్ మాంకాళి బాలయ్య, బి ఆర్ ఎస్ యువజన నాయకులు కొరివి తిరుపతి, జాఫర్, బుర్రా మల్లేశం, వాహనదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.