కామారెడ్డిలో కిరాతక హత్యవివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల కుమారుడిని హత్య చేయించిన తల్లి

కామారెడ్డిలో కిరాతక హత్యవివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల కుమారుడిని హత్య చేయించిన తల్లిప్రజావాణి ఏప్రిల్:18 కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డిలో ఐదేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల లోతైన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్నతల్లే తన ప్రియుడితో కలిసి పన్నాగం పన్ని కుమారుడిని హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనపై పట్టణ సీఐ నరహరి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం...