అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం పేరుతో రూ. 80 వేల టోకరా..
సైదాపూర్‌లో బాధితుడి ఆవేదన! మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):అమాయకత్వమే ఆసరాగా తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో అవుట్‌సోర్సింగ్ కొలువు పేరుతో ఓ సామాన్యుడి వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే....సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన మారెప్ప భూపతి అనే వ్యక్తికి, చొప్పదండికి చెందిన సిరిపురం సంపత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు తెలిసిన పలుకుబడితో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని భూపతిని...