*రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: కోదాడ డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
చిలుకూరు మార్చి 27(ప్రజావాణి)*చిలుకూరు మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చిలుకూరు మండల కేంద్ర కోదాడ- హుజూర్నగర్ రహదారిపై స్థానిక ప్రజలకు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కార్యక్రమం నందు కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రోడ్డు ప్రమాదాలు నివారించటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వాహనాలపై వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కవద్దని ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు....