మూగ జీవాల దాహార్తి కోసం నీటి తోట్లను ఏర్పాటు చేసిన కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి”
ప్రజావాణిన్యూస్(మార్చి23)వేసవికాలంలోఅడవి జంతువుల దాహార్తిని తీర్చడం,వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత అని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు పేర్కొన్నారు. సోమవారం అట్లూరు–సిద్ధవటం ప్రధాన రహదారిలోని అటవీ ప్రాంతంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మూగజీవాల దాహాన్ని తీర్చేందుకు 25కు పైగా నీటి తొట్లు ఏర్పాటు చేసి, ట్యాంకర్ ద్వారా నీటిని నింపించారు.డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు మాట్లాడుతూ, వేసవికాలంలో అడవుల్లో నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులు దాహంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టామని...