మాదిగ అమరవీరులకు ఘన నివాళులు

మాదిగ అమరవీరులకు ఘన నివాళులు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 01 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని స్వామి వివేకానంద కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ ఉమ్మడి వెల్గటూర్ మండల అధ్యక్షులు చెన్న కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని నాయకులు...