మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
ప్రజావాణి న్యూస్ : (మార్చి,08) పోరుమామిళ్ల మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని బ్రయాన్స్ టైలరింగ్ సెంటర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను చేపట్టారు,కార్యక్రమ విశేషాలుసర్టిఫికెట్ల పంపిణీ: టైలరింగ్ సెంటర్‌లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న రెండవ బ్యాచ్ మహిళలకు ఈ సందర్భంగా సర్టిఫికెట్లను అందజేశారు. వారి ఉపాధి అవకాశాలకు ఇది ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు ఆకాంక్షించారు.మూడవ బ్యాచ్ ప్రకటన: రేపటి నుండి మూడవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు...