బాపట్ల జిల్లాలో జరిగిన ఓ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.*

ప్రజావాణి న్యూస్ (మార్చి14)బాపట్ల .నిశ్చితార్థం జరిగి పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుటుంబంలో అనూహ్యంగా విషాదం చోటుచేసుకుంది. కాబోయే వరుడు నమ్మక ద్రోహం చేయడమే కాకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి-కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మార్టూరు మండలం పరిధిలోని ద్రోణాదుల గ్రామంలో చోటుచేసుకుంది.ఆ గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాసరావు కుమార్తె దివ్య హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. మంచి చదువులు పూర్తి చేసి ఉద్యోగం సాధించిన ఆమెకు కుటుంబ సభ్యులు మార్టూరుకు చెందిన మరో...