నలంద స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ప్రజావాణి న్యూస్ : గుడివాడ మార్చి 07 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నలంద స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గుడివాడ II టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జె ఆర్ కె హనీష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినుల కోసం వివిధ క్రీడా పోటీలు నిర్వహించగా, వాటిలో విజయం సాధించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాలలో సేవలందిస్తున్న సీనియర్ మహిళా ఉపాధ్యాయులను సన్మానించి...