prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 2:00 pm Digital Edition : PRAJA VANI

2009 2010 పంచాయతీ రికార్డులు మాయం

2009 2010 పంచాయతీ రికార్డులు మాయం…?

ఆ వ్యవహారంలో తప్పుదారి పట్టించే వాంగ్మూలాలు..?

*బాధితులు కొనుగోలు చేసింది 2004 తర్వాత నా..?

*రికార్డులు 2003 2004లో కేవలం రెండు పహానిలు మాత్రమే కాలిపోయాయి…!

పంచాయతీ రికార్డులు కాలిపోలేదు భద్రంగా బీరువాలో ఉన్నాయి…

అంటూ వివరణ ఇచ్చిన నాటి పంచాయతీ కార్యదర్శి రవికుమార్

*మన ప్రజావాణి చేతికి చిక్కిన నిజాలెన్నో…?

*అక్రమాలకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శి కి కొందరి అభయ హస్తం

*రాజకీయ విభేదాల కారణంగా తప్పుడు వాంగ్మూలాలు తగునా…!

*పంచాయతీ కార్యదర్శి రికార్డులు ఆగమాగం చేసిన మాట వాస్తవం కాదా అంటున్న బాధితులు

నాటి పంచాయతీ కార్యదర్శి కి షోకాజులు జారీ చేస్తే ప్రవేట్ వ్యక్తులకు ఏం సంబంధం అంటూ విమర్శలు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం పందిళ్ళపల్లి మైనర్ గ్రామపంచాయతీలో 2009 2010 2017 పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహించిన కార్యదర్శులు అవినీతి అక్రమాలకు పాల్పడి హక్కుదారులకు కాకుండా అనైతికంగా కాసులకు కక్కుర్తి పడి ఎటువంటి లింకు డాక్యుమెంట్లు అనుమతులు ముటేషన్లు లేకుండా అడ్డగోలుగా హక్కులు కల్పించినట్లు ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా 2002 2003 2004 2005 సంవత్సరంలో మాజీ సర్పంచ్ మేకల తిరుపతి గ్రామ సర్పంచిగా పదవి బాధ్యతలు స్వీకరించి పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో పంచాయతీ కార్యాలయం దగ్ధం అయినట్లు ఆ మేరకు నాటి ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ రెవెన్యూ విధులు ఒకే గొడుగు కింద ఉండటంతో నాటి పంచాయతీ కార్యదర్శి రవికుమార్ రెవెన్యూ పంచాయతీ విధులను నిర్వహించినట్లు మన ప్రజావాణి పరిశీలనలో తేలింది. ఆ తర్వాత ఇదే గ్రామంలో మరో మహిళా సర్పంచి విధులు నిర్వహించినట్లు ప్రభుత్వ రికార్డులు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత మరో పంచాయతీ కార్యదర్శి ఆ తర్వాత ప్రస్తుత మధిర మండలం మాటూరు కు చెందిన పంచాయతీ కార్యదర్శి బండి నాగేంద్రబాబు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించినట్లు స్థానికులు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా 2009 2010 మొదలుకొని 2017 వరకు అక్రమాలు యధావిధిగా కొనసాగినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. కాసులకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలన్నీ చక్కదిద్దినట్లు తెలిసింది. పంచాయతీ కార్యాలయానికి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించి తగలబెట్టారని నాటి పంచాయతీ కార్యదర్శి సంగారపు రవికుమార్ స్థానిక చింతకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. కాగా అవినీతి అక్రమాలకు పాల్పడిన కార్యదర్శి పై నేలకొండపల్లి మండలం చెరువు మాదారానికి చెందిన బాధితులు గత నవంబర్ 14న ప్రజావాణి గ్రీవెన్స్ లో నాటి జిల్లా కలెక్టర్కు డిపిఓ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన నాటి కలెక్టర్ డి పి ఓ ఆదేశాల మేరకు ప్రస్తుత డిపిఓ రెండు దశలో విచారణ చేసి ఎటువంటి ముటేషన్లు అనుమతులు లేకుండా డిమాండ్ డ్రాఫ్ట్ లో ఎలా నమోదు చేశారంటూ ప్రశ్నించి సోకాజ్ నోటీస్ సైతం జారీ చేశారు. లిఖితపూర్వకంగా వివరణ కోరుతూ ఇచ్చిన ఆదేశాలను నెలలకు నెలలు పాటించలేదని తెలిసింది. ఆ మేరకు మరో నోటీసు జారీ చేసినట్లు అప్పుడు ఆలస్యంగా స్పందించిన సదరు పంచాయతీ కార్యదర్శి గ్రామంలో ఉన్న కొన్ని విభేదాలతో కొంతమందిని సంప్రదించి వాంగ్మూలం ఇవ్వాల్సింది పంచాయతీ కార్యదర్శి అయినప్పటికీ కొందరు గ్రామస్తులను పోగుచేసి తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. జిల్లాస్థాయి అధికారులు ఇచ్చిన ఆదేశాలను మండల పంచాయతీ అధికారిని కూడా క్షుణ్ణంగా పరిశీలించకుండా రెండో మారు పొంతన లేని నివేదిక అందజేసినట్లు సమాచారం. జిల్లా స్థాయి అధికారులను పాటిస్తూ పంచాయతీ కార్యదర్శి నుండి వివరాలు సేకరించి సమగ్రంగా నివేదిక అందజేయాల్సిన సదరు అధికారిని అందుకు భిన్నంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఫైలు దగ్ధం ఇతర అంశాలపై ఉమ్మడి రాష్ట్రంలో పందిళ్ళపల్లి పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహించిన సంగారపు రవికుమార్ను మన ప్రజావాణి ప్రతినిధి వీరభద్ర వివరణ కోరగా మేకల తిరుపతి సర్పంచిగా ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో పంచాయతీ ఆఫీసు దగ్దమైందని ఇనుప బీరువాలో పంచాయతీ రికార్డులు భద్రంగా ఉన్నాయని రికార్డులకు ఎటువంటి నష్టం జరగలేదని కేవలం రెండు పహానిలు కాలిపోవడంతో వాటిని యధావిధిగా రాసినట్లు రికార్డులకు డ్యామేజ్ జరగలేదని తాను పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిందని ఆ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు అంగీకరించారు. కాగా 2009 2010 డిమాండ్ డ్రాప్ టు రికార్డులు అందుబాటులో లేవని సదరు మాజీ పంచాయతీ కార్యదర్శి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి అవినీతి అక్రమాలకు పాల్పడి రికార్డులను తారుమారు చేసిన పంచాయతీ కార్యదర్శి తో పాటు నివేదికలో సమగ్ర వివరాలు అందజేయని మండల పంచాయతీ అధికారిని పై చర్యలు తీసుకోవాలని స్థానికులు బాధితులు ప్రజాసంఘాల కార్యకర్తలు పలువురు కోరుతున్నారు.