ఉపాధి హామీలో కొత్త దోపిడీ: టేకుర్‌పేటలో వీడియో కాల్ హాజరుపై తీవ్ర దుమారం వైఎస్సార్ కడప జిల్లా (ప్రజావాణి జూలై 02) పోరుమామిళ్ల మండలం టేకుర్‌పేట పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల దోపిడీకి సంబంధించి అటు ప్రజల నుంచి,ఇటు సోషల్ మీడియాలో ఆరోపణలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.పేద కూలీల కడుపు కొట్టేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారని,టెక్నాలజీని సైతం తమ అవినీతికి అనుకూలంగా మార్చుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు.పారదర్శకత ఉండాల్సిన ప్రభుత్వ పథకంలో జరుగుతున్న ఈ బరితెగింపు వ్యవహారంపై...