పెన్నా గర్భం గుల్ల.కల్లూరు ఇసుకపై ‘లారీల’ కన్ను! గార్లదిన్నె మండలం కల్లూరు పెన్నా నది నుండి యథేచ్ఛగా ఇసుక తరలింపు! స్థానిక అవసరాలు దాటి అనంతపురం,కర్నూలు సుదూర ప్రాంతాలకు అక్రమ రవాణా! పగలు,రాత్రి తేడా లేకుండా గర్జిస్తున్న లారీలు,ట్రాక్టర్లు.నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు! అనంతపురం జిల్లా (ప్రజావాణి జూన్ 27) గార్లదిన్నె మండలం పరిధిలోని కల్లూరు పెన్నా నది ఇసుక దందాకు ప్రధాన కేంద్రంగా మారుతోంది.నదీ గర్భం నుండి విలువైన సహజ వనరులను విచ్చలవిడిగా దోచేస్తూ.పర్యావరణాన్ని నిలువునా ముంచేస్తున్నారు.కల్లూరు పెన్నా నది ప్రాంతం నుంచి...