19వ వార్డులో దూసుకుపోతున్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశిని కోటి( కోటేశ్వర్)
జమ్మికుంట ఫిబ్రవరి 7 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దేశిని కోటి కోటేశ్వర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు
అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉండాలని దేశిని కోటేశ్వర్ కోటి కోరారుఅధికారంలో లేని పార్టీలకు ఓటు వేస్తే ఓటు వృధా అవుతుందని, అభివృద్ధి కుంటు పడుతుందని దేశిని కోటి అన్నారుప్రజా ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, ప్రజా పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఏక కాలంలో రైతు రుణమాఫీ, ప్రతి పంటకు రైతు భరోసా, పంట బోనస్ లాంటి అనేక పథకాలను ప్రజలకు అందిస్తన్నా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని అన్నారుకాంగ్రెస్ పార్టీ పథకాలతో పాటు 19 వ వార్డుకు సంబంధించి, 12 సూత్రాల హామీలను ప్రకటించి దేశిని కోటి కోటేశ్వర్ ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.