పోరుమామిళ్లలో ‘ప్రైవేట్’ దోపిడీ: పుస్తకాలు,ఫీజుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీ కత్తెర! నిబంధనలకు పాతరేస్తూ అడ్డగోలు వసూళ్లు – పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.ఆందోళనలో పేద,మధ్యతరగతి తల్లిదండ్రులు! పోరుమామిళ్ల, జూన్ 22 మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చేసి,విద్యా హక్కు చట్టాన్ని నిలువునా పాతరేస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతోనే, ఫీజుల దందాకు తెరలేపాయి.ఒక పక్క ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని చెబుతున్నా,ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్లకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఐఐటీ, ఒలింపియాడ్,...