కలసపాడు జూన్ 22ప్రజావాణి:అధికారులు మారినా ఆఫీసుల్లో అవినీతి తిష్ట వేస్తూనే ఉంది.పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు కొందరు కింది స్థాయి సిబ్బందికి కాసుల కురిపించే కామధేనువులా మారాయి.వైఎస్సార్ కడప జిల్లా కలస్పాడు మండల రెవెన్యూ కార్యాలయం (MRO Office) లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నడుస్తోంది.ఇక్కడ కొందరు వీఆర్ఏలు (VRA) చెపుతున్నదే వేదంగా సాగుతోంది.ఉన్నతాధికారులను సైతం తమ చేతి ముద్రలతో శాసిస్తూ,కార్యాలయాన్ని అడ్డగా మార్చుకున్నారనే విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఎమ్మార్వో ఆఫీసును శాసిస్తున్న వీఆర్ఏలు!సాధారణంగా మండల కార్యాలయాల్లో ఎమ్మార్వో,ఆర్ఐ ల నిర్ణయాలు ముఖ్యం.కానీ...