ప్రజావాణి న్యూస్ కథనం ప్రకారం ప్రత్యేక విలేకరి రిపోర్ట్: లంచాల కాటేజీగా కాశి నాయన ఎమ్మార్వో ఆఫీస్: ప్రజావాణి కథనానికి కదిలిన అధికార యంత్రాంగం.. వీఆర్వోల గుట్టురట్టు! కాశి నాయన (వైఎస్ఆర్ కడప జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న‘ప్రజావాణి’ (స్పందన) కార్యక్రమానికి కాశి నాయన మండల రెవెన్యూ కార్యాలయంలో పాతర వేస్తున్నారు. బాధితుల పక్షాన నిలిచే ‘ప్రజావాణి న్యూస్’క్షేత్రస్థాయి పరిశీలనలో ఇక్కడి గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సాగిస్తున్న అవినీతి దందా బట్టబయలైంది. మ్యుటేషన్లు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు,విద్యార్థులకు అత్యంత కీలకమైన...