సర్కారు బడిలో ‘బాబా’ అవినీతి దందా.టీసీ కావాలంటే వెయ్యి సమర్పించుకోవాల్సిందే! గంటల తరబడి నిలబడుతున్న విద్యార్థులు,తల్లిదండ్రులు.అడిగేవారే లేరా? పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 18) పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసుకుని, ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థుల నుంచి టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్) ఇవ్వడానికి ఇక్కడి పాఠశాలలో పనిచేస్తున్న క్లర్క్ బాబా ఫక్రుద్దీన్ అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఒక్కో విద్యార్థి నుండి రూ.500 నుండి...