prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 2:04 pm Digital Edition : PRAJA VANI

18 నెలల కొడుకును కొట్టి హత్య చేసిన తండ్రి అరెస్ట్<br>

కొడుకు ఆలనా పాలనా భరించలేకపోతున్నానని, భార్యపై కోపంతో 18 రోజుల కన్న కొడుకును మంచంపై వేసి దారుణంగా కొట్టి చంపిన ఘటనలో జోగిపేట సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ జోగిపేట ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణ గౌరమ్మ లు గత సంవత్సరం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు కుమారుడు జన్మించాడు. పుట్టిన18 రోజులకే పోషించడం నాకు కష్టంగా వుంది అలాగే నాకు వంట చేయడం లేదు అని బాబును అమ్మేస్తా అని కృష్ణ చెప్పడంతో ఇద్దరిమధ్య గొడవ మొదలైoది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపంతో కన్న కొడుకును కాళ్ళు పట్టుకొని మంచంకు వేసి కొట్టడంతో బాబు స్పృహ తప్పడంతో తల్లి పక్కింటి కవితను పిలిచి బాబును హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో బాబు పరిస్థితి చూసి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో మార్గమధ్యంలోని చనిపోయాడు అని జోగిపేట సిఐ అనిల్ కుమార్ మరియు ఎస్సై గిరి శ్రీకాంత్ చెప్పడం జరిగింది. నిందితుడైన కృష్ణను
ఈరోజు ఉదయం జోగిపేట బస్టాండ్‌లో  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.