కవలకుంట్ల గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కవలకుంట్లలో ఆగని అక్రమాలు: వరుస దొంగతనాలు, దారుణ హత్యలకు పాల్పడుతున్న నరిపోగు పుష్ప రాజు.. పట్టించుకోని అధికారులు!కవలకుంట్ల/మార్కాపురం:గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నేరస్థులు ఎంతలా రెచ్చిపోతారో చెప్పడానికి కవలకుంట్ల గ్రామానికి చెందిన నరిపోగు పుష్ప రాజు ఉదంతమే నిదర్శనం. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం నుండి, రైల్వే దొంగతనాలు, జూదం, చివరకు సొంత కుటుంబ సభ్యులనే దారుణంగా హతమార్చే స్థాయికి ఇతని అక్రమాలు చేరుకున్నాయి. అయినా స్థానిక యంత్రాంగం...