prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 4:15 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

17వ వార్డ్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం.

సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 6వ రోజు తడిచెత్త, చెత్త పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్ పర్సన్ పద్మబాయి నర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి పారిశుద్ధ కార్మికులకు అందించాలని సూచించారు. మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ స్వచ్ఛ మున్సిపల్ గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయిని సత్యలక్ష్మి యాదగిరి, స్వప్న సురేష్, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, రొట్టెల శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.