దొంగ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొంది, సమాజంలో మరోలా చలామణీ అవుతున్న ఉదంతంపై ఘాటుగా, అక్షరాలా మోసం: ‘దొంగ’ సర్టిఫికెట్లతో కొలువులు.. అసలు సిసలు అర్హులకు అన్యాయం! సమాజానికి నీతి, నిజాయితీలను నేర్పించాల్సిన గురువులే దారి తప్పారు. అక్షరాలు నేర్పే‘పూజ్యులు’ అడ్డదారుల్లో ఉద్యోగాలు పొంది విద్యావ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. గతంలో తప్పుడు (ఫేక్) కుల ధ్రువీకరణ పత్రాలను సృష్టించి,ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోటాలో టీచర్ ఉద్యోగాలు కొట్టేసిన కొందరు ఘనాపాఠీల గుట్టు ఇప్పుడు రచ్చకెక్కుతోంది.కాగితాల్లో ఒక కులం.. బయట మాత్రం తాము...