*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ కార్యాలయం లో జెండా ఆవిష్కరణ చేసిన - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు* *పలు కార్యాలయాలలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు జాతీయ పతాకం ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు....