prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 6:59 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జనాభా గణన సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలి,కమిషనర్ అలీమ్ బాషా.

మంగళగిరి–తాడేపల్లి▪️ఇంకా 1 రోజు మాత్రమేవెంటనే జనాభా గణనలో మీ ఇంటి వివరాలు నమోదు చేయించుకోండి.మే 30లోపు ఇంటి వివరాలు నమోదు చేయించుకోండి.ప్రతి కుటుంబం జనాభా గణనలో భాగస్వామ్యం కావాలి  కమిషనర్ అలీమ్ బాషా. నగర పాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న జనాభా గణన–2027 కార్యక్రమంలో ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని కమిషనర్ శ్రీ ఎస్. అలీమ్ బాషా కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి,విద్య, వైద్యం మరియు భవిష్యత్ ప్రణాళికల సమర్థ అమలుకు ఖచ్చితమైన జనాభా వివరాలు అత్యంత కీలకమని తెలిపారు.ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2026 మే 30వ తేదీ వరకు మాత్రమే ఇంటి వివరాల నమోదు అవకాశం ఉందని, గడువు ముగియడానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్నదని పేర్కొన్నారు. జనాభా గణన సిబ్బంది ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారని, ప్రజలు వారికి పూర్తి సహకారం అందించి సరైన సమాచారం ఇవ్వాలని ఇంకనూ ఎవరయినా మిగిలిన ఎడల సమాచారం అందిస్తే ఎన్యూమరేటర్లు తగు వివరాలు నమోదు చేస్కుంటారని విజ్ఞప్తి చేశారు.అయితే, కొన్ని ప్రాంతాల్లో నివాసితులు ఇంటిలో లేకపోవడం వల్ల ఇంకా కొన్ని గృహాలు సర్వే పరిధిలోకి రాకపోయే అవకాశం ఉందన్నారు. అలాంటి కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ ఇంటిని ఇప్పటివరకు జనగణన సిబ్బంది సందర్శించకపోతే వెంటనే క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించిన యెడల సంభందిత సెన్సస్ సిబ్బంది మీ ఇంటిని సందర్శించి వివరాలు నమోదు చేస్తారని కమిషనర్ తెలిపారు. 9553631323- 9494498033 9492574369మంగళగిరి–తాడేపల్లి నగర ప్రజలందరూ జనాభా గణనకు సహకరించి విజయవంతం చేయాలని కమిషనర్ అలీమ్ బాషా కోరారు.