జామ మసీదులో ఘట్కేసర్, మే 28 (ప్రజావాణి) : ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ జామియా మసీద్ అధ్యక్షులు సందేశం విడుదల చేశారు. పవిత్ర త్యాగానికి, దానధర్మాలకు, మానవతా విలువలకు ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, “బక్రీద్ పండుగ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. త్యాగానికి, విశ్వాసానికి, మానవత్వానికి ప్రతీక. ఈ పవిత్ర పండుగ...