వైఎస్ఆర్ కడప జిల్లా,(మే19 ప్రజావాణి) పోరుమామిళ్ల మండల పరిధిలోని రైతులము మరియు స్థానిక ప్రజలము. పోరుమామిళ్ల చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద వ్యాపార కేంద్రంగా ఉంది.ప్రస్తుతం మా మండలంలో శాశ్వత రైతు బజార్ లేకపోవడం వల్ల స్థానిక రైతులు తాము పండించిన కూరగాయలను,పంటలను అమ్ముకోవడానికి సరైన స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు.రోడ్ల పక్కన అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.వినియోగదారులకు,రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రభుత్వ స్థలాన్ని రైతు బజార్ కొరకు కేటాయించాల్సిందిగా కోరుతున్నాము.ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేస్తే,దళారీల ప్రమేయం లేకుండా రైతులకు...