*సూర్యాపేట ఏప్రిల్ 26 ప్రజావాణి* :సూర్యాపేట జిల్లాలో జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియను నేటి నుండి ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబ వివరాలను స్వయంగా ఆన్లైన్‌లో నమోదు చేయాలని ఆయన సూచించారు.ఆదివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఈ వివరాలను వెల్లడించారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా స్వీయ గణన విధానంపై వివరణ ఇచ్చారు.