prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:43 pm Digital Edition : BALAKRISHNA BIRKOOR

122 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్

122 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్

 

ప్రజావాణి–బీర్కూర్: బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన 122 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు శుక్రవారం బాన్సువాడలోని పోచారం నివాసంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, బీర్కూర్ తహసీల్దార్ సవాయి సింగ్, బాన్సువాడ పట్టణ, అధికారులు, బీర్కూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శశికాంత్, మేకల విట్టల్, రఘు మరియు బైరాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందుల లస్మయ్య, పండరి పటేల్, నర్సింలు, మొగులుగొండ, సంజీవ్, తుకారం, సలీం, లింగం, పండరి తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.