prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 4:20 pm Digital Edition : ANILKAMAREDDY KAMAREDDY

*కామారెడ్డి RTC ప్రాంగణంలో “Arrive Alive” రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా ముగింపు*

 

ప్రజావాణి

ఏప్రిల్ :18

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

 

 

 

*కామారెడ్డి, ఏప్రిల్ 18:*

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” (సురక్షితంగా చేరుకోండి) అనే ఇతివృత్తంతో ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించిన రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా RTC ప్రాంగణంలో ముగింపు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. RTC డిపో మేనేజర్ ఆధ్వర్యంలో జరిగిన ఇ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ మాట్లాడుతూ, RTC డ్రైవర్లు నిష్ణాతులు అయినప్పటికీ అతి విశ్వాసం ప్రదర్శించకూడదని సూచించారు. రహదారి భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

 

అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI) కె. మధుకర్ మాట్లాడుతూ, రహదారి భద్రత పట్ల నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అప్రమత్తత లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.

 

RTC డిపో మేనేజర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, రహదారి భద్రత విషయంలో యాజమాన్యం కట్టుబడి ఉందని, భద్రత నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

 

ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన డ్రైవర్లను సత్కరించారు.

 

ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, RTC సిబ్బంది, సాధారణ ప్రజలు పాల్గొన్నారు.